గ్రంథాలయానికిస్టడీ మెటీరియల్‌ వితరణ | - | Sakshi
Sakshi News home page

గ్రంథాలయానికిస్టడీ మెటీరియల్‌ వితరణ

Apr 24 2026 6:08 AM | Updated on Apr 24 2026 6:08 AM

పాడేరు : స్థానిక జిల్లా శాఖా గ్రంఽథాలయానికి విశాఖపట్నంకు చెందిన పీబీఎల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ ప్రతినిధులు తన సీఎస్సార్‌ నిధుల నుంచి 40 కుర్చీలు, పోటీపరీక్షల పుస్తకాలు, కంప్యూటర్‌, అరమరలను గురువారం ఉచితంగా అందజేశారు. వీటిని కలెక్టర్‌ నిషాంతి చేతుల మీదుగా గ్రంథాలయ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ నిషాంతి మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఈ స్టడీ మెటీరియల్‌ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రీడర్లు, విద్యార్థులు గ్రంథాలయానికి వచ్చి వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పీబీఎల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రాజేష్‌ను గ్రంధాలయాధికారి మానస, పీ4 యంగ్‌ ప్రొఫెషనల్‌ శ్రీనివాస్‌ తదితరులు సత్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement