ఈవీఎం గోదాంల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ఈవీఎం గోదాంల తనిఖీ

Apr 24 2026 6:08 AM | Updated on Apr 24 2026 6:08 AM

పాడేరు : నెలవారి తనిఖీల్లో భాగంగా పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న ఈవీఎంల గోదామును జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్‌ లోకేశ్వరరావు పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి గురువారం తనిఖీ చేశారు. ఈవీఎంల గోదాముకు వేసిన సీలును పరిశీలించారు. భద్రత ప్రమాణాలపై అక్కడ గస్తీ కాస్తున్న భద్రత దళాల నుంచి తెలుసుకున్నారు. పలు సలహాలు, సూచనలు చేశారు. సీసీ కెమెరాల పని తీరును పరిశీలించారు. అనంతరం విజిటింగ్‌ రిజిస్టర్‌లో సంతకం చేశారు. కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు నందు, మాణిక్యం, తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement