● జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ హెచ్చరిక
● రెవెన్యూ అధికారులతో
ప్రత్యేక సమావేశం
సాక్షి,పాడేరు: ప్రజలకు రెవెన్యూ సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ హెచ్చరించారు. స్థానిక ఎస్.ఆర్.శంకరన్ ఆడిటోరియంలో జిల్లా రెవెన్యూ అఽధికారులు, తహసీల్దార్లు, డీటీలు, వీఆర్వోలతో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా అన్ని రెవెన్యూ ఆంశాలపై జేసీ సమగ్రంగా సమీక్షించారు. అధికారులు, సిబ్బందికి సంబంధించి ఐవీఆర్‌ఎస్‌లో పనితీరును తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్, భూముల మ్యూటేషన్ల పనులపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలన్నారు.జిల్లాలో రెవెన్యూ రికార్డుల స్కానింగ్,డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో లోకేశ్వరరావు, ఎస్‌డీసీ నీలకంఠరావు, కలెక్టరేట్ ఏవో ప్రసాద్ పాల్గొన్నారు.
పర్యాటక పారిశ్రామిక ప్రాజెక్ట్‌లు వేగవంతం
జిల్లాలోని పర్యాటక,పారిశ్రామిక ప్రాజెక్ట్‌ల అభివృద్ధిని వేగవంతం చేయాలని,జేసీ తిరుమణి శ్రీపూజ ఆదేశించారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో పర్యాటక ప్రాజెక్ట్‌లపై అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యాటక,పారిశ్రామిక ప్రాజెక్ట్‌ల ద్వారా స్థానిక గిరిజన యువతకు లభించే ఉపాధి అవకాశాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలన్నారు.ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అఽధికారి రమణారావు, ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, జిల్లా పర్యాటకశాఖ అధికారి దాసు, డీఎఫ్‌వో ఉమామహేశ్వరి, జిల్లా ఉద్యానవన అధికారి బాలకర్ణ, గిరిజన సంక్షేమశాఖ డీడీ పరిమళ పాల్గొన్నారు.


