క్రీడలతోనే మానసిక ఉల్లాసం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతోనే మానసిక ఉల్లాసం

Apr 23 2026 8:06 AM | Updated on Apr 23 2026 8:06 AM

పాడేరులో జిల్లా స్థాయి ఫుట్‌బాల్‌ జట్ల ఎంపిక ప్రారంభం

పాడేరు: క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసికోల్లాసం లభిస్తుందని, విద్యార్థులు ప్రాథమిక దశ నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని పాడేరు, అరకు ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో అండర్‌–13, 14 జిల్లా స్థాయి ఫుట్‌బాల్‌ జట్ల ఎంపికలను నిర్వహించారు. ఈ ఎంపిక ప్రక్రియను ఇరువురు ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరావు, మత్స్యలింగం హాజరై లాంఛనంగా ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.జిల్లా స్థాయిలో ఎంపికై న జట్లు రాష్ట్ర స్థాయి పోటీల్లోజిల్లాకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ అధికారి ఎ. జగన్‌మోహన్‌రావు, స్కూల్‌ గేమ్స్‌ జిల్లా సెక్రటరీ పి. సూరిబాబు, స్పోర్ట్స్‌ అథారిటీ సిబ్బంది ఆర్‌. ప్రసాద్‌, పీఈటీలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement