విద్య, వైద్యంపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

విద్య, వైద్యంపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు

Apr 23 2026 8:06 AM | Updated on Apr 23 2026 8:06 AM

కలెక్టర్‌ నిశాంతి హెచ్చరిక

సాక్షి,పాడేరు: అన్ని గిరిజన విద్యాలయాల్లో మెరుగైన విద్య,వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్‌ టి.నిశాంతి హెచ్చరించారు. బుధవారం ఆమె మండలంలోని కందమామిడి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.విద్యార్థినులకు అందుతున్న విద్యా కార్యక్రమాలతో పాటు,భోజనం నాణ్యతను సమీక్షించారు.ప్రభుత్వ నిబంధనల మేరకు పౌష్టికాహారం అందించాలని, విద్యార్థినుల వైద్యంపై దృష్టి పెట్టాలని డిప్యూటీ మేట్రిన్‌ను ఆదేశించారు..అనంతరం విద్యార్థినులతో ముఖాముఖీ నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. అలాగే పాఠశాల హెచ్‌ఎం సంతకం రిజిస్టర్‌లో లేకపోవడంపై ఆమె స్పందించారు. దీనిపై సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.అన్ని రికార్డులతో హెచ్‌ఎంను కలెక్టరేట్‌కు హాజరుకావాలని ఆదేశించారు .ఈ కార్యక్రమంలో ఏటీడబ్ల్యూవో అఖిల, జిల్లా వ్యవసాయాఽధికారి నందు, ఆహార భద్రత అధికారి గ్రీస్మశ్రీ, సర్వేలెన్స్‌ అధికారి అఖిల్‌ పాల్గొన్నారు.

మొక్కలతో పర్యావరణ పరిరక్షణ

ఎర్త్‌డే పురష్కరించుకుని కలెక్టరేట్‌ ఆవరణలో బుధవారం కలెక్టర్‌ టి.నిశాంతి పలు రకాల మొక్కలను నాటారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్క లు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణ, సమతుల్యత, భూతాప నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరు కనీసం ఒక్క మొక్క అయిన నాటి సంరక్షించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో లోకేశ్వరరావు, ఎస్‌డీసీ నీలకంఠరావు, కలెక్టరేట్‌ ఏవో ప్రసాదరావు, సీపీవో ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement