చింతపల్లి: తక్కువ నీటి సదుపాయంతో వేరుశనగ పంటను సాగు చేసి గిరిజన రైతులు మంచి దిగుబడులు, అధిక ఆదాయం పొందవచ్చని స్థానిక వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బీవీ తిరుమలరావు అన్నారు. బుధవారం చౌడుపల్లి పంచాయతీ కేంద్రంలోని సచివాలయంలో రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.చింతపల్లి డివిజన్ పరిధిలో రెండు వే ఎకరాల్లో వేరుశనగ సాగు లక్ష్యంగా ప్రభుత్వం 1,140 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేసింది. వీటిని మొట్టమొదటిసారిగా ఆన్‌లైన్ పద్ధతిలో 100 శాతం రాయితీపై పంపిణీ చేస్తున్నారు. విత్తనాలతో పాటు పంట రక్షణ కోసం 50 శాతం రాయితీపై వేపనూనెను కూడా రైతులకు అందిస్తున్నారు. గత ఏడాది సాగు చేసిన రైతులకు పంపిణీలో మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.విత్తనాలు తీసుకున్న రైతులకు పంట కాలమంతా ఎప్పటికప్పుడు అవసరమైన యాజమాన్య పద్ధతులపై వ్యవసాయ అధికారులు శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టి. మధుసూదనరావు, వీహెచ్‌ఏలు శోభన్‌బాబు, పరమేశ్వరరావు, స్థానిక రైతులు పాల్గొన్నారు.
ఏడీఏ తిరుమలరావు


