ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి

Apr 23 2026 8:06 AM | Updated on Apr 23 2026 8:06 AM

దేవరాపల్లి: ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. మండలంలోని గ్రామానికి చెందిన ధర్మిశెటి శ్రీను (51) సోమవారం తన కల్లంలో గడ్డి మందుతాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆయన కుటుంబ సభ్యులు వెంటనే విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. గతంలో ఎద్దు పొడిచిందని, అప్పటి నుంచి తీవ్ర అనారోగ్య సమస్యలతో శ్రీను బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ బాధలను తట్టుకోలేక మనస్తాపంతో గడ్డి మందు తాగి ఉంటాడని వారు తెలిపారు. మృతుడి భార్య రామలక్ష్మి బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ పైడిరాజు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement