యువతి అదృశ్యంపైఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

యువతి అదృశ్యంపైఫిర్యాదు

Apr 23 2026 8:06 AM | Updated on Apr 23 2026 8:06 AM

పెందుర్తి: తన కుమార్తె అదృశ్యమైనట్లు ఓ మహిళ పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జీవీఎంసీ 88 వార్డు కోటనరవలో నందిగం పద్మావతి.. తన కుమార్తె మౌనిక(27)తో కలిసి ఉంటోంది. బీ ఫార్మసీ పూర్తి చేసిన మౌనిక ఇంటి వద్దే ఉంటుంది. ఈ నెల 19న తల్లి పద్మావతి మార్కెట్‌కు వెళ్లి తిరిగి వచ్చేసరికి కుమార్తె మౌనిక ఇంటి వద్ద లేదు. ఆందో ళనకు గురైన పద్మావతి బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీసింది. అయితే తర్వా తి రోజు మౌనిక తల్లికి ఫోన్‌ చేసి ‘నేను చందు అనే వ్యక్తితో వెళ్లిపోతున్నాను. నా కోసం వెతకొద్దు’అని చెప్పి.. ఫోన్‌ ఆఫ్‌ చేసింది. పద్మావతి ఫిర్యాదు మేరకు సీఐ కేవీ సతీష్‌కుమార్‌ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement