మద్దిలపాలెం: విశ్వవిద్యాలయం అంటే కేవలం భవనాలే కాదు.. అక్కడ బోధించే విశిష్ట ఆచార్యులు, వారు జరిపే పరిశోధనలు, వాటి ఫలితంగా సమాజ ఉపయుక్తంగా నిలిచే ఆవిష్కరణలు. నిత్యం బోధన, పరిశోధనల్లో మునిగే ఆచార్యులకు కాస్త ఆటవిడుపుగా ఉండటానికి ఆంధ్రా యూనివర్సిటీలో దశాబ్దాల కిందట ప్రత్యేకంగా ఫ్యాకల్టీ క్లబ్‌ను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రానికి పూర్వం 1940లో ఏయూలో ఫ్యాకల్టీ క్లబ్‌కు అప్పటి వీసీ సర్ కట్టమంచి రామలింగారెడ్డి శంకుస్థాపన చేసి భవనం నిర్మించారు. రెండు అంతస్తుల్లో నిర్మించిన ఈ భవనం నేటికీ చెక్కు చెదరకుండా మనకు దర్శనమిస్తోంది. దాదాపు 85 ఏళ్ల కిందట నిర్మితమైన ఈ చారిత్రక భవనం నేటికీ ఆచార్యులకు కాస్త సేదతీరడానికి ఉపయుక్తంగా నిలుస్తోంది. చుట్టూ విశాలమైన ఖాళీ స్థలంతో పాత భవనం కనిపిస్తే.. ప్రస్తుత ఫ్యాకల్టీ భవనానికి రెండు వైపులా భారీ భవంతులు వెలిశాయి. ఫ్యాకల్టీ క్లబ్‌కు ఒకవైపు ఆటా భవనం, డీసీఎంఎస్ విభాగం.. మరోవైపు అంజలి గెస్ట్‌హౌస్, అడ్వాన్స్‌డ్ సైన్సెస్ భవనాలు నిర్మించారు.
నాడు: 1940లో ఏయూ ఫ్యాకల్టీ భవనం
నేడు: ఆంధ్రా యూనివర్సిటీ ఫ్యాకల్టీ క్లబ్


