ఘనంగా రామానుజుల తిరునక్షత్రం పూజలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా రామానుజుల తిరునక్షత్రం పూజలు

Apr 23 2026 7:42 AM | Updated on Apr 23 2026 7:42 AM

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో విశిష్టాద్వైత స్థాపకులు భగవత్‌ రామానుజుల తిరునక్షత్రం పూజలను ఘనంగా నిర్వహించా రు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను, భగవత్‌ రామానుజుల ఉత్సవమూర్తిని ఆలయ బేడామండపంలో హంసమూలన వేంజేపచేశారు. విశేషపూజలు నిర్వహించారు. దివ్య ప్రబంధ పారాయణాన్ని పఠించా రు. అనంతరం బేడా తిరువీధి నిర్వహించారు. స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌, ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు, అర్చకులు ఈ పూజలు నిర్వహించారు.

విశిష్టాద్వైత స్థాపకులు భగవత్‌ రామానుజులు తిరునక్షత్ర పూజలను శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెంది కొండదిగువ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న రామానుజులు విగ్రహానికి అభిషేకం జరిపారు. విశేష పూజలు నిర్వహించారు. అర్చకుడు చిన్నా తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement