గాజువాక: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా జీవీఎంసీ ప్రకటించిన వేస్ట్ టు వండర్ చాంపియన్‌షిప్ పోటీల కోసం గాజువాకకు చెందిన మహాత్మా, మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు జాగరపు శ్రీను ఇనుప వ్యర్థాలతో భారతదేశ చిత్రపటాన్ని రూపొందించారు. బ్రాండ్ వైజాగ్‌లో అందరూ భాగస్వాములు కావడంలో భాగంగా ఇనుప స్క్రాప్‌తో అందమైన శిల్పాలను తయారు చేయాలని జీవీఎంసీ పోటీలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఫ్యాబ్రికేషన్ యూనిట్‌ను నిర్వహిస్తున్న శ్రీను సైకిల్ ఛైన్లు, స్క్వేర్ పైపులు, జీఐ షీట్లు, సైకిల్ క్రాంక్‌లు, రిమ్‌లు, 6ఎంఎం, 8 ఎంఎం వేస్ట్ రాడ్లు, బైక్ చైన్లు, చైన్ స్పాకెట్‌లు, ఆటో గేర్ బాక్స్ వ్యర్థాలను ఉపయోగించి ఈ చిత్రాన్ని తయారు చేశారు. అందులో జాతీయ జెండాతోపాటు ఎద్దు, రైతు, ఆర్మీ సోల్జర్ వంటి చిత్రాలను కూడా దానికి అనుసంధానం చేశారు. ఈ చిత్రాన్ని చూసినవారు భలే ఉందే అంటూ శ్రీనును అభినందిస్తున్నారు.


