● ఎస్టీ కేటగిరీలో 6,431 ర్యాంక్ సాధన
డుంబ్రిగుడ: మండలంలోని ఏకలవ్య ఆదర్శ నివాస విద్యాలయ విద్యార్థి జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ పాఠశాలలో ఇంటర్ ఎంపీసీ చదువుతున్న కిల్లో ప్రవీణ్, ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ సెషన్–2 ఫలితాల్లో సత్తా చాటాడు. పర్సంటైల్: 77.26, జాతీయ స్థాయి ర్యాంకు: 3,60,414, ఎస్టీ కేటగిరీ ర్యాంకు: 6,431 సాధించాడు. ప్రవీణ్ సాధించిన ఈ విజయం పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుమన్ కుమార్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థిని అభినందించిన వారిలో వైస్ ప్రిన్సిపాల్ మురుగేష్, ఉపాధ్యాయ బృందం ఉన్నారు.


