ఎస్పీ కార్యాలయంలో 65 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

ఎస్పీ కార్యాలయంలో 65 అర్జీలు

Apr 21 2026 4:02 AM | Updated on Apr 21 2026 4:02 AM

పీజీఆర్‌ఎస్‌లో వృద్ధురాలి సమస్యను వింటున్న అదనపు ఎస్పీ మోహన్‌రావు

అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌కు 65 ఆర్జీలు వచ్చాయి. అదనపు ఎస్పీ ఎల్‌.మోహన్‌రావు ఆర్జీలు స్వీకరించి, సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలో ఉన్న సమస్యలు వారం రోజుల్లో పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, నేరాలు, ఇతర విభాగాలకు సంబంధించిన సమస్యలపై అర్జీలు వచ్చాయన్నారు. చట్టపరిధిలో సమస్యలను పరిష్కరించేందుకు దిగువస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ బి.శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement