స్పేసెస్‌ డిగ్రీ కళాశాలకు పురస్కారాలు | - | Sakshi
Sakshi News home page

స్పేసెస్‌ డిగ్రీ కళాశాలకు పురస్కారాలు

Apr 21 2026 4:02 AM | Updated on Apr 21 2026 4:02 AM

స్పేసెస్‌ డిగ్రీ కళాశాల ప్రతిభకు గుర్తింపుగా అవార్డు అందిస్తున్న అతిథులు

పాయకరావుపేట: స్పేసెస్‌ డిగ్రీ కళాశాలకు ఆంధ్రా యూనివర్సిటీ నుంచి అరుదైన గౌరవం దక్కిందని శ్రీ ప్రకాష్‌ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్‌ విజయ్‌ ప్రకాష్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉత్తమ పనితీరు కనబర్చిన ఏయూ పరిధిలోని 306 కళాశాలల్లో శ్రీ ప్రకాష్‌ విద్యా సంస్థల అనుబంధ సంస్థ స్పేసెస్‌ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి)ను ఉత్తమ కళాశాలగా ఎంపిక చేశారన్నారు. ఈ నెల 18న విశ్వవిద్యాలయ వైస్‌ చాన్సలర్‌ జి.పి. రాజశేఖర్‌, ఏపీ ఉన్నత విద్యా శాఖ కమిషనర్‌ నారాయణ భరత్‌ గుప్తా, విజ్ఞాన్‌ సంస్థల చైర్మన్‌ లావు రత్తయ్యల నుంచి కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎ.రామకృష్ణారెడ్డి పురస్కారం అందుకున్నారన్నారు. స్పేసెస్‌ డిగ్రీ కళాశాల నుంచి ఉత్తమ కళాశాల అధ్యాపకుడిగా డాక్టర్‌ అరుణ్‌ కుమార్‌ త్రిపాఠి, ఉత్తమ పూర్వ విద్యార్థిగా రాజస్థాన్‌ విశ్వవిద్యాలయం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ టి.శివప్రసాద్‌, ఉత్తమ విద్యార్థిగా టి.శ్వేత పురస్కారాలు అందుకున్నారన్నారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల అధినేత సిహెచ్‌ నరసింహారావు, కళాశాల అధ్యాపక బృందం, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement