వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నిక

Apr 21 2026 4:02 AM | Updated on Apr 21 2026 4:02 AM

దేవరాపల్లి : వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నట్టు ఆ సంఘం నాయుకులు సోమవారం తెలిపారు. దేవరాపల్లిలో జరిగిన జిల్లా మహాసభలలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, రైతు సంఘం నాయుకులు ఎం. అప్పలరాజు, గండి నాయన్‌బాబు పర్యవేక్షణలో 21 మందితో కూడిన నూతన కమిటీని ఎన్నుకున్నామన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా యం. సత్యన్నారాయణ, కార్యదర్శిగా డి.వెంకన్నను ఎన్నుకున్నారు. ఆఫీస్‌ బేరర్స్‌గా కె. గోవిందరావు, కె.భవానీ, ఇరటా నర్సింహమూర్తి, బిటి. దొర, వి. సూరిబాబును ఎన్నుకున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా కార్యదర్శిగా ఎన్నికై న వెంకన్న మాట్లాడుతూ జిల్లా మహా సభలలో తీర్మానం చేసిన తీర్మాణాలపై పోరాటం సాగించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఆయన తెలిపారు. జిల్లా మహాసభలను విజయంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement