బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు నాగమానస
సాక్షి, పాడేరు: జిల్లాలోని అన్ని గ్రామాల్లో బాలల హక్కుల పరిరక్షణకు అధికార యంత్రాంగం కృషిచేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు డాక్టర్ పి.నాగమానస ఆదేశించారు. సోమవారం ఆమె జిల్లాలో పర్యటించారు.హుకుంపే ట కేజీబీవీని సందర్శించి విద్యార్థినులతో మాట్లా డారు. విద్యా,ఇతర మౌలిక సదుపాయాలపై సమీక్షించారు. డి.చింతలవీధి గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో ఆమె మాట్లాడారు.బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలపై గిరిజనులకు అవగాహన కల్పించారు.అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదు వు మధ్యలో మానేసిన బాలబాలికలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలన్నారు.వేసవి కాలంలో తల్లిదండ్రులంతా తమ పిల్లలను పర్యవేక్షిస్తూ ఆరోగ్యం,భద్రత, విద్యపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలన్నారు.ఈ సమావేశంలో కలెక్టర్ టి.నిశాంతి,ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయిపడాల్,పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.


