ధర్నా విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ధర్నా విజయవంతం చేయాలి

Apr 21 2026 4:02 AM | Updated on Apr 21 2026 4:02 AM

చింతపల్లి: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేసేందుకు ఉపాధ్యాయులంతా తరలిరావాలని జిల్లా పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు యు.వి. గిరి కోరారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పీఆర్‌సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని,30 శాతం ఐఆర్‌ను ప్రకటించాలని, ఓపీఎస్‌ను అమలు చేయాలని, ఇన్‌సర్వీసులు ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌ రద్దు చేయాలని,స్కూల్‌ కాంప్లెక్సు హెచ్‌ఎంలను గ్రేడ్‌–1హెచ్‌ఎంలుగా మార్చాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు కొర్రు మత్స్యలింగం, ఏపీ జేఏసీ కో కన్వీనర్‌ కుడుముల వెంకటరమణ,వసపరి శామ్యూల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement