డీఆర్వోగా లోకేశ్వరరావు బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

డీఆర్వోగా లోకేశ్వరరావు బాధ్యతల స్వీకరణ

Apr 21 2026 4:02 AM | Updated on Apr 21 2026 4:02 AM

మూడు పోస్టులకు ఒకే అధికారి

సాక్షి,పాడేరు: జిల్లా రెవెన్యూ అధికారి(ఎఫ్‌ఏసీ)గా ఎం.వి.ఎస్‌.లోకేశ్వరరావును నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుతం ఆయన పాడేరు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా,ఇన్‌చార్జి ఆర్డీవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డీఆర్‌వోగా మూడవ పోస్టులో బాధ్యతలు స్వీకరించారు.అనంతరం కలెక్టర్‌ టి.నిశాంతిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.డీఆర్వోగా బాధ్యతలు స్వీకరించిన లోకేశ్వర రావును కలెక్టర్‌ అభినందించారు. ఎస్‌డీసీగా,పాడేరు ఆర్డీవోగాను,డీఆర్వోగా జిల్లాలో ఉత్తమసేవలు అందించాలని ఆమె సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement