● 15 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
గూడెం కొత్తవీధి: శనివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి కుంకుమపూడి ఘాట్ రోడ్డులో చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. దీంతో ఈ మార్గంలో ఉన్న సుమారు 15 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆదివారం అగ్రహారం వెళ్లేందుకు వచ్చిన ఒక అంబులెన్స్, రోడ్డుపై కూలిన చెట్లు తొలగించకపోవడంతో ముందుకు వెళ్లలేక వెనుదిరిగి వెళ్లిపోయింది. అత్యవసర సమయంలో వైద్య సేవలకు కూడా అంతరాయం కలుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, యుద్ధ ప్రాతిపదికన చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


