● జాతర రద్దీతో ఖాళీ అయిన బంకులు
చింతపల్లి: స్థానిక పెట్రోల్ బంకులు మూతపడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రీ ముత్యాలమ్మ జాతర సందర్భంగా చింతపల్లికి వాహనాల రాకపోకలు ఒక్కసారిగా పెరగడంతో బంకుల్లో నిల్వలు అయిపోయాయి.చింతపల్లిలో జీసీసీ, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల ద్వారా ఇంధన సరఫరా జరుగుతుంది. ముఖ్యంగా జీసీసీ బంకులో ప్రతిరోజూ సుమారు రూ.4లక్షల నుంచి రూ.5 లక్షల వరకు విక్రయాలు సాగుతుంటాయి. అయితే ఆదివారం సాయంత్రం నుంచే పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తిగా అయిపోవడంతో సిబ్బంది ‘నో స్టాక్’ బోర్డులు ఏర్పాటు చేశారు. జాతర కోసం వచ్చిన భక్తులు, వాహనదారులు ఇంధనం దొరక్క నానా అవస్థలు పడ్డారు. సోమవారం ఉదయానికి జీసీసీ బంకుకు పెట్రోల్ లోడ్ చేరుకుంటుందని సిబ్బంది వెల్లడించారు.


