నూకాంబికను దర్శించుకున్న నటి శ్రీలక్ష్మి | - | Sakshi
Sakshi News home page

నూకాంబికను దర్శించుకున్న నటి శ్రీలక్ష్మి

Apr 20 2026 8:05 AM | Updated on Apr 20 2026 8:05 AM

అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారిని ఆదివారం నటి శ్రీలక్ష్మి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో గవిరెడ్డి శ్రీనివాస్‌సారథ్యంలో తెరకెక్కిస్తున్న ‘చీన్‌ టపాక్‌ డుం డుం‘ చిత్రంలో ప్రధానమైన పాత్రలో నటించేందుకు ఇక్కడకు వచ్చినట్టు చెప్పారు. అమ్మవారిని మొదటి సారిగా దర్శించుకోవడం ఎంతోఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి నాగచైతన్య అఖిల్‌ ఫ్యాన్స్‌ అధ్యక్షుడు ఎస్‌. భానుచందర్‌, సభ్యుడు షేక్‌ రియాజ్‌, ఆలయ కమిటీ డైరెక్టర్లు పొలిమేర ఆనంద్‌ కుమార్‌, దాడి రవికుమార్‌, కాండ్రేగుల రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement