ఎనిమిది మంది జూదరుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

ఎనిమిది మంది జూదరుల అరెస్టు

Apr 20 2026 8:05 AM | Updated on Apr 20 2026 8:05 AM

కోటవురట్ల: మండలంలోని పాములవాకలో కాయిన్‌ గేమ్‌ ఆడుతున్న ఎనిమిది మందిని ఆదివారం అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. అందిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడిచేయగా ఎనిమిది కాయిన్‌ గేమ్‌ ఆడుతూ పట్టుబడినట్టు చెప్పారు. వారిని అరెస్టు చేసి, రూ.9,200 స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, పేకాట, కోడి పందాలు, కాయిన్‌ గేమ్‌ వంటి జూదాలు ఆడినా చట్టపరంగా చర్యలు తప్పవని ఎస్‌ఐ హెచ్చరించారు.

పేకాటరాయుళ్లకు అరదండాలు

బుచ్చెయ్యపేట: మండలంలోని సీతయ్యపేట శివారులో తోటల వద్ద పేకాట స్థావరంపై దాడి చేసి, ఏడుగురుని అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.31,400 స్వాధీనం చేసికుని, కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement