రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు

Apr 15 2026 8:08 AM | Updated on Apr 15 2026 8:08 AM

కలెక్టర్‌ నిశాంతి

వాడవాడలా ఘనంగా అంబేడ్కర్‌

జయంతి

సాక్షి,పాడేరు: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలను ప్రతి ఒక్కరు స్మరించుకుని మంచి సమాజ లక్ష్యం నిర్మించుకోవాలని కలెక్టర్‌ టి.నిశాంతి కోరారు. ఆయన జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక పాతబస్టాండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎస్పీ అమిత్‌బర్దర్‌,జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ,ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ,ఇన్‌చార్జి డీఆర్‌వో నీలకంఠరావు డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్పీ కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి కలెక్టర్‌ నిశాంతి,జిల్లా ఎస్పీ అమిత్‌బర్దర్‌ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్‌ ఆశయ సాధన అందరి లక్ష్యం కావాలని ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ పిలుపునిచ్చారు. ఐటీడీఏలో అంబేడ్కర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు,ఏవో హేమలత తదితరులు పాల్గొన్నారు.

జెడ్పీ నిధులతో అంబేడ్కర్‌పార్కు అభివృద్ధి

ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో జెడ్పీ చైర్‌ పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, వివిధ పార్టీల నేతలు,ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. చిన్నారుల నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. దాతల సహకారంతో అన్నసంతర్పణ నిర్వహించారు.అంబేడ్కర్‌ పార్కు అభివృద్ధికి కృషి చేస్తున్న జెడ్పీ చైర్‌ పర్సన్‌ సుభద్ర,మూర్తి దంపతులను సత్కరించారు.ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌ పర్సన్‌ మాట్లాడుతూ స్థానిక అంబేడ్కర్‌ పార్కును జెడ్పీ నిధులతో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో కళావేదిక నిర్మిస్తామని ఆమె పేర్కొన్నారు. మండల అంబేడ్కర్‌ ఆశయ కమిటీ అధ్యక్షులు కె.సూర్యనారాయణ,వైస్‌ఎంపీపీ భాగ్యవతి,ఎంపీటీసీలు సుబ్బలక్ష్మి, కమల, పార్టీల నేతలు పద్మారావు, రమేష్‌, సన్యాసమ్మ, బాబురావు, నరసింగరావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement