● పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు యూవీ గిరి
చింతపల్లి: ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 21న పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించనున్నట్లు పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు యూవీ గిరి తెలిపారు. మంగళవారం చింతపల్లి గిరిజన సంక్షేమ బాలర ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సాగిన రామరాజు పడాల్, సూర్యనారాయణ ఆధ్వర్యంలో ధర్నా పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిషన్‌ను నియమించాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలను గ్రేడ్–1 హెచ్‌ఎంలుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులంద రూ పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పీఆర్‌టీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యు లు కొర్రు మత్స్యలింగం, జిల్లా ఉపాధ్యక్షురాలు రమణమ్మ, గిరిజన సంఘ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గెమ్మిలి మోహన్, మండల అధ్యక్షులు ప్రసాద్, జయబాదురి, రూప పాల్గొన్నారు.


