డుడుమ జలపాతం
అనంతగిరి మండలంలోని సరియా జలపాతం
సాక్షి,పాడేరు: జిల్లాలో గెడ్డలు,జలపాతాల్లో స్నానం, ఈతకోసం దిగుతున్న స్థానికులతో పాటు,మైదాన ప్రాంత పర్యాటకులు మునిగి ప్రాణాలను విడుస్తున్నారు. గిరిజన ప్రాంతంలోని యువత, బాలలు అధికంగా గెడ్డలు, చెరువు, జలపాతాల్లో ఈత కొట్టడంతో పాటు స్నానాలు చేస్తుంటారు. అప్రమత్తంగా లేకపోవడంతో క్షణాల్లో మృత్యు ఒడికి చేరుకుంటున్నారు. చాలా జలపాతాల్లోను నిత్యం ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నప్పటికీ వాటి వద్ద ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో ప్రధాన మత్స్యగెడ్డతో పాటు జలపాతాలు, వాగులు అధికంగా ఉన్నాయి.
‘చావు’రాయి..
డుంబ్రిగుడ మండలంలో గల చాపరాయిలోను ఈ 20ఏళ్లలో 10మంది వరకు పర్యాటకులు మృతిచెందారు.స్నానాలతో సరదాగా గడుపుతూనే దిగువ గెడ్డలోకి జారి పడి మరణించారు.
ల్లాలో గెడ్డలు మృత్యుకుహరాలుగా మారాయి. సరదాగా ఈతకొట్టేందుకు, స్నానం చేసేందుకు వెళ్లిన చిన్నారులను పొట్టన పెట్టుకుని తల్లిదండ్రులను శోకసంద్రంలోకి నెడుతున్నాయి. తాజాగా ఆదివారం పెదబయలు మండలం సీకరి పంచాయతీ పన్నెడ గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు మత్స్యగెడ్డలో స్నానానికి వెళ్లి మృత్యువాత పడ్డారు. ఇటీవల హుకుంపేట మండలం భూర్జ పంచాయతీ ములగుమ్మి జలపాతం ముగ్గురు యువతులను కబళించి కన్నవారికి కడుపుకోత మిగిల్చింది.
గెడ్డలు, జలపాతాల వద్ద అప్రమత్తం
గెడ్డలు, జలపాతాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పెదబయలు మండలంలో మత్స్యగెడ్డలో మునిగి ముగ్గురు బాలలు మృతి చెందడం బాధాకరం. తమ పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. జలపాతాల్లో స్నానాలు చేయడం,సెల్ఫీలు దిగడం ప్రమాదకరం. అన్ని గెడ్డలు,జలపాతాల వద్ద ప్రమాదాల నివారణకు పోలీసుశాఖ తగిన చర్యలు చేపడుతుంది.
– అమిత్‌బర్దర్, ఎస్పీ
జిల్లా ప్రధాన గెడ్డగా గుర్తింపు పొందిన మృత్యుగెడ్డతో పాటు పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రం మత్స్యగుండం కూడా గిరిజనుల ప్రాణాలను బలిగొంటోంది. జి.మాడుగుల, పాడేరు, హుకుంపేట, పెదబయలు,ముంచంగిపుట్టు మండలాల వరకు విస్తరించిన మత్స్యగెడ్డ పరీవాహక ప్రాంతంలో గిరిజనుల మరణాలు అఽధికంగా ఉన్నాయి.మత్స్యగెడ్డ దాటుతూ, నాటుపడవలు మునిగి, చేపల వేట చేస్తూ, స్నానాలు చేస్తూ ఇలా సుమారు 50మంది వరకు గిరిజనులు మరణించారు. వీరిలో చాలామంది మృతదేహాల జాడ కూడా తెలియలేదు.
జి
గాదెగుమ్మిలో 40 మంది మృతి
కొయ్యూరు మండలంలోని గాదెగుమ్మి జలపాతం ఈ 20ఏళ్లలో 40 మంది వరకు పర్యాటకులు,స్థానిక గిరిజనులను కబళించింది. ఈ జలపాతంలో స్నానం చేసేందుకు దిగి ఊబిలోను,రాళ్ల మధ్య చిక్కుకుని పలువురు ప్రాణాలు విడిచిన సంఘటనలు ఆందోళనకలిగిస్తున్నాయి. అనకాపల్లితో పాటు తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పర్యాటకులు అధికంగా మృతిచెందారు.
జిల్లాలో ఐదు రోజుల వ్యవధిలో ఏడుగురు మృతి చెందారు.ఈనెల 9వతేదీన అనంతగిరి మండలం వాలాసి ప్రాంతంలోని ములగుమ్మి జలపాతంలో స్నానం చేసేందుకు దిగిన సాలెపు త్రిష,పవిత్ర,రత్నకుమారి మృతిచెందగా,ఈనెల 11వతేదీన పెదబయలు మండలం గంపరాయి బ్రిడ్జి వద్ద అల్లంపుట్టుకు చెందిన తుర్రె సోమన్న అనే వృద్ధుడు మత్స్యగెడ్డలో మునిగి మృతిచెందాడు.ఈనెల 12వతేదీ ఆదివారం పెదబయలు మండలం లకేయిపుట్టు గ్రామ సమీపంలోని మత్స్యగెడ్డలో 15ఏళ్ల లోపు ముగ్గురు గిరిజన విద్యార్థులు స్నానాలు చేస్తూ మునిగి చనిపోయారు.ఐదు రోజుల వ్యవధిలో ఏడుగురు మృతిచెందడం జిల్లా వాసుల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి.
ప్రమాదకరంగా జలపాతాలు
ప్రాణాలు తీస్తున్న స్నానం, ఈత సరదా
గత ఐదు రోజుల్లో ఏడుగురి మృతి
తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్న ఘటనలు
మృత్యుగెడ్డ


