పెదబయలు మండలంలోని గిన్నెలకోట పంచాయతీలో గల తారాబు జలపాతం ఈ ఐదేళ్లలో పర్యాటక ప్రాంతంగా ప్రాచుర్యం పొందింది.తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా,ఛత్తీస్‌గఢ్,మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి పర్యాటకుల తాకిడి అధికంగా ఉంది.ఎత్తైన కొండల నుంచి ఏడాది పొడవున నీటి ప్రవాహం ఉంటుండడంతో పర్యాటకులు ఈజలపాతంలో జలకాలాడేందుకు ఉత్సహం చూపుతారు. ఈ ఐదేళ్లలో ఐదుగురు పర్యాటకులు ఈ జలపాతం వద్ద మృతిచెందారు.ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకపోగా కర్రల వంతెన సాయంతో జలపాతానికి వెళ్లాలి. ఈ ప్రయాణం ప్రమాదకరంగా ఉంటుంది.ఈ పరిస్థితులలో ప్రమాదాలకు గురవుతున్నారు.
కర్రల సాయంతో తారాబు జలపాతంకు చేరుకుంటున్న పర్యాటకులు
కర్రల సాయంతో తారాబు జలపాతానికి చేరుకుంటున్న పర్యాటకులు


