రంగురాళ్ల క్వారీల వద్ద నిఘా | - | Sakshi
Sakshi News home page

రంగురాళ్ల క్వారీల వద్ద నిఘా

Apr 14 2026 7:34 AM | Updated on Apr 14 2026 7:34 AM

డీఎఫ్‌వో నరసింహారావు

చింతపల్లి: డివిజన్‌ పరిధిలో రంగురాళ్ల క్వారీల్లో అక్రమ తవ్వకాలు జరగుకుండా నిఘా ఏర్పాటు చేసినట్టు డివిజనల్‌ ఫారెస్టు అధికారి(డీఎఫ్‌వో)వై.నర్సింహారావు తెలిపారు. ముత్యాలమ్మ జాతర సందర్భంగా రంగురాళ్ల వ్యాపారులు తవ్వకాలకు గిరిజనులను ప్రోత్సహిస్తున్నారనే సమాచారం రావడంతో క్వారీ ప్రాంతాల్లో షిఫ్టుల వారీగా 24 గంటలూ కాపలా ఉండేలా సిబ్బందిని నియమించినట్టు చెప్పారు. చింతపల్లి మండలంలో సత్యవరం,మేడూరు,పోతురాజుగున్నలు, జీకే వీధి మండలంలో గుర్రాలగొంది,సిగనాపల్లి క్వారీల్లో ఈ నాలుగు రోజుల పాటు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇప్పటికే రంగురాళ్ల వ్యాపారులకు నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు.ఈ క్వారీ ప్రాంతాల్లో ఎవరైనా అనుమానితులు సంచరిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు అవగాహన కల్పించినట్టు డీఎఫ్‌వో తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement