సాక్షి,పాడేరు: స్థానిక ప్రభుత్వ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న వైద్య విద్యార్థులు రక్తదానం చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ శనివారం నిర్వహించిన ఈ శిబిరాన్ని కళాశాల ప్రధాన ఆచార్యులు డాక్టర్ పి.వెంకటేశ్వర్లు ప్రారంభించారు. రక్తదానం చేసిన మొదటి, ద్వితీయ సంవత్సరం చదువుతున్న 25 మంది విద్యార్థులను వైద్యులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాన ఆచార్యులు మాట్లాడుతూ రక్తదాన శిబిరాలను అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేసి ప్రాణదాతలు కావాలన్నారు. ప్రొఫెసర్ డాక్టర్ రాజీవ్,ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు గంగరాజు.నాగరాజు,సూర్యారావు,తమర్భ ప్రసాదనాయుడు,రవి,శ్రీనివాస్,జయలక్ష్మి,పూర్ణ పాల్గొన్నారు.


