చింతపల్లి: రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన పెద్దగెడ్డ–చింతలూరు గ్రామాల మధ్య శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జి.మాడు గులు మండలం గెమ్మిలి పంచాయతీ సుర్లపాలెం గ్రామానికి చెందిన కిల్లో రాజేష్, మువ్వల కేశవరావు, మువ్వల గణేష్‌లు వ్యక్తిగత పనుల నిమిత్తం చింతపల్లి వస్తున్నారు. అదే సమయంలో జీ.మాడుగులు మండలం అరకపల్లికి చెందిన విండ్ర నాయుడు, దార ప్రసాద్, సుశీలలు చింతపల్లి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో పెద్దగెడ్డ–చింతలూరు మధ్యలో వీరిద్దరి ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో వారిని చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం, పరిస్థితి విషమంగా ఉన్న నలుగురిని మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.


