సెజ్‌ నిర్వాసిత పునరావాస కాలనీల్లో కార్డెన్‌ సెర్చ్‌ | - | Sakshi
Sakshi News home page

సెజ్‌ నిర్వాసిత పునరావాస కాలనీల్లో కార్డెన్‌ సెర్చ్‌

Apr 12 2026 3:12 AM | Updated on Apr 12 2026 3:12 AM

అచ్యుతాపురం రూరల్‌ : ప్రత్యేక ఆర్థిక మండలి పునరావాస కాలనీలో పరవాడ డీఎస్పీ బి.మోహన్‌రావు ఆధ్వర్యంలో శనివారం పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. బృందాలుగా విడిపోయి ఇళ్లను సోదా చేసి, వాహనాలను తనిఖీ చేశారు. విద్యా సంస్థలకు సమీపంలోని షాపుల్లో విక్రయిస్తున్న గుట్కాలు, ఖైనీలను స్వాధీనం చేసుకుని, వారిపై కేసులు నమోదు చేశారు. రికార్డులు లేని 16 ద్విచక్రవాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. కార్డెన్‌ సెర్చ్‌లో అచ్యుతాపురం సీఐ చంద్రశేఖరరావు, యలమంచిలి సీఐ ధనుంజయ రావు, ఎస్‌ఐలు సుధాకరరావు, వెంకటరావు, రామకృష్ణ, మహాలక్ష్మి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement