● బాధ్యతల స్వీకరణ
● కార్మిక సంఘ నేతల అభినందనలు
సీలేరు: ఏపీ జెన్‌కో విద్యుత్ కాంప్లెక్స్ సీలేరు సివిల్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా బాధ్యతలు చేపట్టిన అప్పలనాయుడును శుక్రవారం తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు.
సమస్యల పరిష్కారానికి విన్నపం
అనంతరం అప్పర్ సీలేరు క్యాంపులో ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సివిల్ సమస్యలను నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలు, ఇతర సమస్యలను పరిష్కరించి సహకరించాలని కోరారు. దీనిపై ఈఈ అప్పలనాయుడు సానుకూలంగా స్పందిస్తూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ప్రెసిడెంట్ రేఖ అప్పారావు, రీజనల్ ప్రెసిడెంట్ త్రినాథరావు, రీజినల్ జాయింట్ సెక్రటరీ భాస్కరరావు, రాష్ట్ర కమిటీ డిప్యూటీ సెక్రటరీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


