గాయపడిన యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

గాయపడిన యువకుడి మృతి

Apr 11 2026 8:04 AM | Updated on Apr 11 2026 8:04 AM

కూర్మన్నపాకలలో విషాదం

చింతపల్లి: గూడెం కొత్తవీధి మండలం రింతాడ సమీపంలో జరిగిన రో డ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొర్రా కోటిబాబు (26) చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ కూర్మన్నపాకలు గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజన యువకులు గురువారం సాయంత్రం ద్విచక్రవాహనంపై గూడెంకొత్తవీధి వెళ్తుండగా, రింతాడ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో పాంగి అప్పారావు అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందడం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన రెండో యువకుడు కొర్రా కోటిబాబును మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోటిబాబు కూడా మరణించడంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృత్యువాత పడటంతో కూర్మన్నపాకలు గ్రామంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement