అరకులోయ టౌన్: హుకుంపేట మండలం, బూర్జ పంచాయతీ పరిధిలోని మూలగుమ్మి జలపాతంలో గురువారం జరిగిన దుర్ఘటనపై ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈత కోసం జలపాతంలో దిగి, నీటి లోతు తెలియక ముగ్గురు యువతులు (త్రిష, పవిత్ర, రత్నకుమారి) మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు రవిబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆయా కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రభుత్వానికి విజ్ఞప్తి : పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు కరువవ్వడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పర్యాటక ప్రాంతాల్లో రక్షణ ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వం మరి యు సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.
ఆర్థిక సహాయం అందించాలి
ప్రాణాలు కోల్పోయిన యువతుల కుటుంబాలు నిరుపేదలు కావడంతో, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి తగిన ఆర్థిక సహాయం అందించి అండగా నిలవాలని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు కోరారు.
ఎమ్మెల్సీ కుంభా రవిబాబు


