అంతర్రాష్ట్ర రహదారిపై కూలిన భారీ వృక్షం | - | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర రహదారిపై కూలిన భారీ వృక్షం

Apr 11 2026 8:04 AM | Updated on Apr 11 2026 8:04 AM

దారకొండలో తప్పిన భారీ ప్రమాదం

సీలేరు: గూడెంకొత్తవీధి మండలం దారకొండలో శుక్రవారం త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. జనసంచారం అధికంగా ఉండే అంతర్రాష్ట్ర రహదారి పక్కన ఉన్న ఒక భారీ వృక్షం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఎటువంటి గాలివాన లేకున్నా, మిట్టమధ్యాహ్నం ప్రశాంతంగా ఉన్న సమయంలో ఈ చెట్టు ఒక్కసారిగా కూలడంతో స్థానికులు భయాందోళనకు గుర య్యారు. చెట్టు కూలుతున్న శబ్దాన్ని విన్న చుట్టుపక్కల నివాసాల వారు, బాటసారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. చెట్టు పడిన ప్రాంతంలో ఇళ్లు, ప్రజలు ఉన్నప్పటికీ, ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

నిలిచిపోయిన రాకపోకలు

ఈ సంఘటన కారణంగా అంతర్రాష్ట్ర రహదారిపై రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. అయితే, ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా, సాయంత్రం వరకు చెట్టును తొలగించేందుకు అధికారులు ఎవరూ స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు ఆరు గంటల పాటు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement