4,900 గృహాలకు సోలార్‌ రూప్‌ టాప్‌ | - | Sakshi
Sakshi News home page

4,900 గృహాలకు సోలార్‌ రూప్‌ టాప్‌

Apr 9 2026 7:53 AM | Updated on Apr 9 2026 7:53 AM

చింతపల్లి ఈపీడీసీఎల్‌ ఏడీఈ రాంబాబు

కొయ్యూరు: చింతపల్లి సబ్‌ డివిజన్‌లో 4,900 గృహాలకు సోలార్‌ రూప్‌ టాప్‌ వేసేందుకు నిర్ణయించామని ఈపీడీసీఎల్‌ చింతపల్లి ఏడీఈ కేఎస్‌ రాంబాబు వెల్లడించారు. ఈ మేరకు చింతపల్లిలో పనులు చేపట్టామన్నారు. కొయ్యూరులోను త్వరలో పనులు చేపడతామన్నారు. బుధవారం సాయంత్రం ఆయన కాకరపాడు సబ్‌స్టేషన్‌లో సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పేరుకుపోయిన బకాయిలపై ప్రత్యేక డ్రైవ్‌ చేపడతామన్నారు. ఎస్టీ, ఎస్సీలకు 200 యూనిట్ల వరకు విద్యుత్‌ ఉచితమైనా వారిలో చాలా మంది అర్హులు కాదన్నారు. పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నట్టుగా ఉండడంతో అది వర్తించదన్నారు. దీంతో చాలా కాలం నుంచి వాటి బకాయిలు పేరుకుపోయాయన్నారు. సోలార్‌ ఆప్‌లైన్‌ మాత్రమే ప్రస్తుతానికి ఉందన్నారు .దీనిని ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సోలార్‌ వేసుకున్న గిరిజనులకు యథావిధిగా ఉచిత విద్యుత్‌ పథకం వర్తిస్తుందన్నారు. శ్లాబ్‌ కలిగిన గృమాలకు మాత్రమే సోలార్‌ వేస్తామని తెలిపారు.ముందుగా కేటగిరి–2 విబాగంలో స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేస్తామన్నారు.దీని మూలంగా కలిగే లాభాలను ఆయన వివరించారు.పాడైన స్తంబాల స్థానంలో కొత్త స్తంబాలను వేస్తున్న ప్రక్రియ కొద్ది రోజుల కిందట ప్రారంభమైందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement