ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం

Apr 9 2026 7:53 AM | Updated on Apr 9 2026 7:53 AM

● పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ● పోలీసుల తీరును నిరసిస్తూ బుచ్చెయ్యపేటలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన

బుచ్చెయ్యపేట: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా చంద్రబాబు ప్రభుత్వ పాలన సాగుతోందని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఏబీఎన్‌లో కొత్త పలుకు పేరుతో మహిళల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం విశాఖలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి వెళ్తున్న పాడేరు ఎమ్మెల్యేను బుచ్చెయ్యపేటలో పోలీసులు అడ్డగించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్‌సీసీ మండల నాయకులు రోడ్డుపై బైఠాయించారు. చంద్రబాబు ప్రభుత్వానికి,పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరావు మాట్లాడుతూ రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ సోషల్‌ మీడియా,వైఎస్సార్‌ కాంగ్రెస్‌సీపీ కార్యకర్తలు,నాయకులపై చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెడుతోంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు,కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. కూటమి నేతలు అనుచిత వ్యాఖ్యలు,దాడులు చేస్తుంటే పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కూటమి నాయకులకు, పచ్చ మీడియాకు త్వరలోనే తగిన బుద్ధి చెబుతామని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు జోగా కొండబాబు,జెడ్పీటీసీ దొండా రాంబాబు,వైస్‌ ఎంపీపీ గొంపా చినబాబు,మాజీ సర్పంచ్‌లు పెదిరెడ్ల మాణిక్యం,సుంకరి గాంధీ,గొంపా అప్పారావు,కోవెల ఈశ్వరరావు,జెర్రిపోతుల రామారావు,రాము తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement