పలు రైళ్లకు అదనపు కోచ్‌లు | - | Sakshi
Sakshi News home page

పలు రైళ్లకు అదనపు కోచ్‌లు

Apr 8 2026 7:20 AM | Updated on Apr 8 2026 7:20 AM

తాటిచెట్లపాలెం: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు రైళ్లకు అదనపు కోచ్‌లను జతచేస్తున్నట్లు వాల్తేర్‌ డివిజన్‌ అధికారులు తెలిపారు. ఏప్రిల్‌ నెలాఖరు వరకు ఈ అదనపు కోచ్‌లను జతచేస్తున్నారు. విశాఖపట్నం–బ్రహ్మపూర్‌–విశాఖపట్నం(18526/18525) ఎక్స్‌ప్రెస్‌, విశాఖపట్నం–భువనేశ్వర్‌–విశాఖపట్నం(22820/22819) ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌, విశాఖపట్నం–కోరాపుట్‌–విశాఖపట్నం(18512/18511) ఎక్స్‌ప్రెస్‌, విశాఖపట్నం–రాయ్‌పూర్‌–విశాఖపట్నం(58528/58527) పాసింజర్‌, విశాఖపట్నం–కోరాపుట్‌–విశాఖపట్నం(58538/58537) పాసింజర్‌, విశాఖపట్నం–బ్రహ్మపూర్‌–విశాఖపట్నం(58532/58531) పాసింజర్‌, విశాఖపట్నం–భవానిపట్న–విశాఖపట్నం(58504/58503) పాసింజర్‌, విశాఖపట్నం–గుణుపూర్‌–విశాఖపట్నం(58506/58505) పాసింజర్‌కు కోచ్‌లను జతచేస్తున్నారు.

విశాఖ–మహబూబ్‌నగర్‌ రైళ్లు పాక్షిక రద్దు

హైదరాబాద్‌ డివిజన్‌, సికింద్రాబాద్‌–డోన్‌ సెక్షన్‌, మహబూబ్‌నగర్‌–మన్యంకొండ స్టేషన్‌ల మధ్య జరుగుతున్న భద్రతా పనుల నిమిత్తం ఈ నెల 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు విశాఖపట్నం–మహబూబ్‌నగర్‌–విశాఖపట్నం (12861/12862) ఎక్స్‌ప్రెస్‌ జడ్చ ర్ల వరకు మాత్రమే రాకపోకలు సాగిస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ తేదీల్లో జడ్చర్ల–మహబూబ్‌నగర్‌ మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించవు.

Advertisement
 
Advertisement
Advertisement