సకలజీవులపై ప్రేమ, కరుణ కలిగి ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సకలజీవులపై ప్రేమ, కరుణ కలిగి ఉండాలి

Apr 5 2026 7:48 AM | Updated on Apr 5 2026 7:48 AM

బయ్యవరం వద్ద పాదయాత్ర ముగించి ధ్యానం చేస్తూ విశ్రమిస్తున్న దిగంబర జైన ముని ఆచార్య ప్రముఖ్‌ సాగర్‌ జి మహారాజ్‌

కశింకోట: సకల జీవుల పట్ల ప్రేమ, గౌరవం,కరుణ కలిగి ఉండాలని దిగంబరజైన ముని ఆచార్య ప్రముఖ్‌ సాగర్‌జి మహారాజ్‌ ఉద్బోధించారు. మండలంలోని బయ్యవరం గ్రామానికి దిగంబర జైన మునులైన సాగర్‌జి మహారాజ్‌ సహా ప్రభాకర్‌ సాగర్‌ చేపట్టిన మంగళ అహింస పాద యాత్ర శనివారం సాయంత్రం చేరింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సకల జీవుల పట్ల ప్రేమ, గౌరవం,కరుణ కలిగి ఉండాలనే సందేశాన్ని బోధించడానికి దేశ వ్యాప్తంగా పాదయాత్రలు చేస్తున్నామన్నారు. గత ఏడాది నవంబర్‌ 30న కోల్‌కత్తా నుంచి చేపట్టిన పాద యాత్ర కర్నాటకలోని బెంగళూరుకు వచ్చే జులై వరకు సాగనుందన్నారు. ప్రతి రోజు సుమారు 25 కిలో మీటర్లు యాత్ర చేస్తున్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement