రోగులకు నరకయాతన | - | Sakshi
Sakshi News home page

రోగులకు నరకయాతన

Apr 5 2026 8:00 AM | Updated on Apr 5 2026 8:00 AM

రోగుల రద్దీ

రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలి

ఉదయం నుంచి క్యూలైన్‌లో నిలబడ్డా

జ్వరంతో ఈనెల 2వతేదీ గురువారం జిల్లా ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్‌గా చేరా. వైద్యులు రక్తపరీక్షలు చేయించమన్నారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్యూలైన్‌లో నిల్చుని తీవ్ర ఇబ్బందులు పడ్డా. మధ్యాహ్నం 3గంటలకు పరీక్షలకు రక్తం సేకరించారు. – గెమ్మెలి గున్మమ్మ,

బిరిమిశాల, పాడేరు మండలం

సాక్షి, పాడేరు: జిల్లావ్యాప్తంగా సీజనల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో పాడేరు జిల్లా సర్వజన ఆస్పత్రికి రోగుల తాకిడి గణనీయంగా పెరిగింది. అయితే, రక్తపరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులతో రోగులు తీవ్ర నరకం చూస్తున్నారు. ప్రతిరోజూ 200 నుంచి 300 మందికి పైగా రోగులు రక్తపరీక్షల కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడలేక అవస్థలు పడుతున్నారు.

జ్వరపీడితులతో రద్దీ

జిల్లా ఆస్పత్రి కావడంతో అన్ని ప్రాంతాల నుంచి జ్వరపీడితుల రద్దీ అధికంగా ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి కూడా అత్యవసర కేసులను పాడేరు ఆస్పత్రికే రిఫర్‌ చేస్తున్నారు. రోజువారీ ఓపీ సంఖ్య 500 దాటుతుండగా, వారిలో సుమారు 200 మందికి పైగా రక్తపరీక్షలు అవసరమవుతున్నాయి.

● ప్రస్తుతం రక్తపరీక్షల విభాగాన్ని ఆస్పత్రిలోని ఒక ఇరుకై న వరండాలో ఏర్పాటు చేశారు. అక్కడ సరైన గాలి వెలుతురు లేకపోవడంతో రోగులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఫ్యాన్ల సౌకర్యం కూడా లేకపోవడంతో, తీవ్ర జ్వరంతో ఉన్న రోగులు ఆ ఉక్కపోతకు అల్లాడిపోతున్నారు.

సిబ్బంది కొరత.. ఒక్కరితోనే పరీక్షలు

రక్తపరీక్షల విభాగంలో రోగుల సంఖ్యకు తగ్గట్టుగా సిబ్బంది లేరు. ఓపీ రాసేందుకు ఇద్దరు ఉన్నప్పటికీ, రక్త నమూనాలు సేకరించడానికి ఒక్కరు మాత్రమే అందుబాటులో ఉండటంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. రోజుకు వందలాది మంది వస్తున్నా, అదనపు కౌంటర్‌ ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రోగులు మండిపడుతున్నారు.

ఇన్‌పేషెంట్లకూ తప్పని తిప్పలు

గతంలో ఆస్పత్రిలో చేరిన ఇన్‌పేషెంట్ల వద్దకే సిబ్బంది వెళ్లి రక్త నమూనాలు సేకరించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తీవ్ర అస్వస్థతతో ఉన్న రోగులు కూడా సహాయకుల సాయంతో నడుచుకుంటూ లేదా చక్రాల కుర్చీలపై పరీక్షా కేంద్రానికి రాక తప్పడం లేదు.

ఆలస్యంగా రిపోర్టులు: మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్‌ వంటి వ్యాధుల నిర్థారణకు రక్త నమూనాల సేకరణలో జాప్యం జరగడమే కాకుండా, రిపోర్టులు ఇవ్వడంలోనూ తీవ్ర ఆలస్యమవుతోంది. ఇక్కడ పూర్తిస్థాయి సిబ్బందికి బదులుగా ఎక్కువ మంది ట్రైనీ విద్యార్థులే విధులు నిర్వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రిపోర్టులు సకాలంలో రాకపోవడంతో రోగులకు సత్వర వైద్యం అందడం లేదని వారి సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాడేరు రూరల్‌: మత విద్వేషాలకు తావులేకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని క్రైస్తవ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం క్రిస్టియన్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ సమితి ఆధ్వర్యంలో పాస్టర్స్‌ ఫెలోషిప్‌ అసోసియేషన్‌ నాయకులు పాస్టర్‌ తిమోతి, మత్స్యరాజుల నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ అధికారులకు, సబ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం ప్రకారం పాలకులందరూ ప్రజలందరినీ సమానంగా చూడాలని కోరారు. అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉంటున్న హిందూ, క్రైస్తవ, మైనారిటీ వర్గాల మధ్య రాజకీయాల కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టడం తగదన్నారు. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ సామాజిక వర్గాల వారికి రిజర్వేషన్లు వర్తించవని చెప్పడం భావ్యం కాదన్నారు. సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించి, గతంలో ఉన్న విధంగానే రిజర్వేషన్లను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాస్టరర్ల సంఘ నాయకులు సల్మాన్‌, బాబురావు, జాన్‌, జోసెఫ్‌, యోబు, ప్రేమ్‌ కుమార్‌, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.

రక్తపరీక్షల విభాగంలో

రక్తపరీక్షల విభాగం విస్తరిస్తాం

రక్తపరీక్షల విభాగం సేవలను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వరండాకు ఆనుకుని ఉన్న విశాలమైన గదిలో రక్తపరీక్షల విభాగం ఏర్పాటుకు నిర్ణయించాం. అక్కడ ఫ్యాన్లు, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉంచుతాం. రక్తపరీక్షలు వేగవంతానికి తగిన చర్యలు తీసుకుంటాం.

– డాక్టర్‌ ఎర్రయ్య, ఇన్‌చార్జి డిప్యూటీ సూపరింటెండెంట్‌, జిల్లా ఆస్పత్రి, పాడేరు

క్రైస్తవ సంఘాల డిమాండ్‌

పాడేరు జిల్లా ఆస్పత్రిలో రోగుల పాట్లు

రక్తపరీక్షల కోసం గంటల తరబడి

నిరీక్షణ!

ఊపిరి సలపక అవస్థలు

ఉక్కిరిబిక్కిరి అవుతున్న రోగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement