పరుగు పోటీలో పాల్గొన్న పోలీస్ అధికారులు
ఆరిలోవ(విశాఖ తూర్పు): అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని విశాలాక్షినగర్ ఆర్మ్డ్ రిర్వ్డ్ పోలీస్ మైదానంలో శనివారం పోలీస్ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథి అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇలాంటి క్రీడా పోటీలు పోలీస్ విభాగంలో ఐపీఎస్ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు ఒకే వేదికపైకి తీసుకువస్తుందని తెలిపారు. తోటి సిబ్బందితో పరిచయాలు పెంచుకొని సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి దోహదపడతాయన్నారు. ఆయా పోటీల్లో అనకాపల్లి, పరవాడ, నర్సీపట్నం, సబ్ డివిజన్లతోపాటు ఆర్మ్డ్ రిజర్వ్డ్ విభాగానికి చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చూపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


