డ్రగ్స్‌ రహిత సమాజానికి సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ రహిత సమాజానికి సహకరించాలి

Apr 1 2026 7:42 AM | Updated on Apr 1 2026 7:42 AM

పాడేరు డీఎస్పీ అభిషేక్‌

భూసిపుట్టు వారపు సంతలో

ఆపరేషన్‌ వజ్ర ప్రహార్‌

ముంచంగిపుట్టు: డ్రగ్స్‌ రహిత సమాజానికి ప్రజలంతా సహకరించాలని పాడేరు డీఎస్పీ ఆర్‌ఆర్‌విఎస్‌ అభిషేక్‌ అన్నారు. జిల్లా ఎస్పీ అమిత్‌ బర్ధర్‌ ఆదేశాల మేరకు మండలంలోని భూసిపుట్టు పంచాయతీ కేంద్రంలో పోలీసులు ఆపరేషన్‌ వజ్ర ప్రహార్‌ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. పాడేరు డీఎస్పీ అభిషేక్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గంజాయి నివారణ, సైబర్‌ నేరాలు, రహదారి భద్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఆర్‌ఆర్‌విఎస్‌ అభిషేక్‌ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగంతో జీవితాలు నాశనం అవుతాయన్నారు. ముఖ్యంగా యువత భవిష్యత్తు జైల్‌ పాలు అవుతుందని. దీంతో వారి కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. గంజాయి రవాణా, సాగుకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలపై ఎటువంటి సమాచారం ఉన్న 1972 టోల్‌ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలన్నారు. ప్రజలంతా పోలీసుశాఖకు సహకరించాలని ఆయన కోరారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులచే ప్రతిజ్ఞ చేయించారు. జి.మాడుగుల సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ నాని, పోలీసులు, గిరిజనులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement