సురక్షిత విశాఖే లక్ష్యంగా పనిచేద్దాం | - | Sakshi
Sakshi News home page

సురక్షిత విశాఖే లక్ష్యంగా పనిచేద్దాం

Apr 1 2026 7:36 AM | Updated on Apr 1 2026 7:36 AM

అల్లిపురం: నగరంలో ప్రజల భద్రతను మెరుగుపరచడం, సామాజిక అంశాలపై అవగాహన కల్పించడం, సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడంలో సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు భాగస్వాములు కావాలని నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి కోరారు. పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో నగరానికి చెందిన సుమారు 35 మంది ఇన్‌ఫ్లూయెన్సర్లతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీస్‌ శాఖ, సోషల్‌ మీడియా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే సమాజంలో గణనీయమైన మార్పు తీసుకురావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరుత్సాహంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో ధైర్యం నింపడం, ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌, చిట్‌ఫండ్‌ మోసాలు, ఆన్‌లైన్‌ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడం, డ్రగ్స్‌ వల్ల కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించడం, హెల్మెట్‌ ధారణ ఆవశ్యకత, రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకోవడం, పోలీస్‌ శాఖ ప్రవేశపెట్టిన స్పీడ్‌ లేజర్‌ గన్స్‌ పనితీరుపై సమాచారం అందించడం తదితర అంశాలపై వీడియోలు, సందేశాల రూపంలో విస్తృత ప్రచారం కల్పించాలని సీపీ కోరారు. అనంతరం ఇన్‌ఫ్లూయెన్సర్ల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

ఇన్‌ఫ్లూయెన్సర్లకు సీపీ శంఖబ్రత బాగ్చి పిలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement