స్టీల్‌ప్లాంట్‌ తల్లీ.. ఇక సెలవు | - | Sakshi
Sakshi News home page

స్టీల్‌ప్లాంట్‌ తల్లీ.. ఇక సెలవు

Apr 1 2026 7:36 AM | Updated on Apr 1 2026 7:36 AM

● ఓ కార్మికుడి వీడ్కోలు

● ఓ కార్మికుడి వీడ్కోలు

స్టీల్‌ప్లాంట్‌ మెయిన్‌ గేటు వద్ద నమస్కారం చేస్తున్న అప్పలరాజు

ఉక్కునగరం: విశాఖ ఉక్కు కర్మాగారం రుణం తీర్చుకోలేనిదని స్టీల్‌ప్లాంట్‌ కార్మికుడు గొందేశి అప్పలరాజు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ రోల్‌షాప్‌ అండ్‌ రిపేర్‌ షాప్‌ విభాగానికి చెందిన జనరల్‌ ఫోర్‌మెన్‌ అప్పలరాజు వాలంటరీ రిటైర్‌మెంట్‌ స్కీమ్‌ ద్వారా మంగళవారం పదవీ విరమణ చేశారు. విభాగంలో సహోద్యోగుల మధ్య జరిగిన కార్యక్రమాల అనంతరం ఆయన ఇంటికి బయల్దేరారు. స్టీల్‌ప్లాంట్‌ నుంచి బయటకు వచ్చిన అప్పలరాజు ఉద్వేగానికి లోనయ్యారు. స్టీల్‌ప్లాంట్‌ మెయిన్‌ గేటుకు నమస్కారం చేసి కన్నీటి పర్యంతమయ్యారు. 35 ఏళ్ల తన సేవలను పూర్తి చేసుకుని వెళ్లడం బాధగా ఉందన్నారు. తన కన్న తల్లి తర్వాత తల్లి లాంటి స్టీల్‌ప్లాంట్‌ తనకు మంచి జీవితం, కుటుంబాన్ని ఇచ్చిందన్నారు. స్టీల్‌ప్లాంట్‌ రుణం తీరుకోలేనిదంటూ భావోద్వేగానికి లోనయ్యారు. సహోద్యోగులు ఆయనను ఓదార్చి ఇంటికి పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement