వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్టు కోసం ప్రజాభిప్రాయ సేకరణ
ముంచంగిపుట్టు: జోలాపుట్టు పంచాయతీ కేంద్రంలో వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్ట్ ఏర్పాటుకై బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ సదస్సును నిర్వహించనున్నట్టు తహసీల్దార్ భాస్కరఅప్పారావు తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.16.45కోట్లతో సర్వే నెం.5లోని జోలాపుట్టు పంచాయతీలో వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు జోలాపుట్టు గ్రామ సచివాలయంలో సదస్సు నిర్వహిస్తామని, ప్రజాప్రతినిధులు, స్థానికులు హాజరై తమ యొక్క అభిప్రాయాలను తెలియజేయాలని ఆయన కోరారు. ఆర్‌ఐ భాస్కర్, వీర్వోలు తదితరులు పాల్గొన్నారు.


