సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకుని చీకట్లోనే నివాసముంటున్నామని, నూతన విద్యుత్ మీటర్‌కు ఫీజు కట్టి ఐదు నెలలు అవుతున్నా విద్యుత్ శాఖ సిబ్బంది మీటర్ వేసి విద్యుత్ సౌకర్యం కల్పించడం లేదని, తక్షణమే తమకు విద్యుత్ సౌకర్యం కల్పించాలంటూ మాడుగుల మండలం చింతలూరు గ్రామానికి చెందిన భార్యభర్తలు గుడేపు దుర్గాలు, లక్ష్మి పీజీఆర్‌ఎస్‌లో వినతి అందించారు. రజక వృత్తి చేసుకుంటూ జీవనం సాగించే తాము చీకట్లోనే నివాసముండాల్సి వస్తుందని, చుట్టుపక్కల అందరికీ అందించిన విద్యుత్ సౌకర్యం తమకు కూడా అందించి న్యాయం చేయాలని ఆమెను కోరారు. –గుడేపు లక్ష్మి
అధికారుల అండతో అక్రమ రిజిస్ట్రేషన్లు
రిజిస్టర్డ్ దస్తావేజు ద్వారా కొనుగోలు చేసిన భూమిని తన పేరున కాకుండా రెవెన్యూ అధికారులు రీసర్వేలో ఇతరుల పేరున ఆన్‌లైన్ చేయడంతో తన భూమిపై అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, తక్షణమే రిజిస్ట్రేషను జరగకుండా నిలిపివేసి తన పేరున ఆన్‌లైన్ చేయాలంటు కశింకోట మండలం అచ్చెర్ల గ్రామానికి చెందిన కర్రి రాజేశ్వరి రెవెన్యూ క్లినిక్‌లో ఫిర్యాదు చేశారు. దస్తావేజు నెం.2199/2023 దిన ఉన్నప్పటికీ 2024లో జరిగిన రీసర్వేలో ఇతరుల పేరున వీఆర్‌వో ఆన్‌లైన్ చేయడం దారుణమని, తక్షణమే విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు.
–కర్రి రాజేశ్వరి


