దేవరాపల్లి: గిరిజన యువతి దూసరి లక్ష్మి(22) సోమవారం రాత్రి దేవరాపల్లిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ శివారు కొరపర్తి గ్రామానికి చెందిన పెంటయ్య, జమ్ములమ్మ దంపతుల ఇద్దరు కుమార్తెలు దేవరాపల్లిలో ఐదేళ్లగా నివసిస్తున్నారు. పెద్ద కుమార్తె లక్ష్మి స్థానిక ప్రైవేటు మెడికల్ ల్యాబ్లోను, చిన్న కుమార్తె భవాని సెల్ దుకాణంలోను పని చేస్తున్నారు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో తన అక్క ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోతున్నట్లు వేరొక వ్యక్తి ఫోన్ ద్వారా తెలుసుకున్న చెల్లెలు భవాని వెంటనే తాము అద్దెకుంటున్న గదికి పరుగులు తీసింది. అప్పటికే అక్క చున్నీతో ఉరేసుకొని విగతజీవిగా ఉండటాన్ని చూసి బోరున విలపించింది. ఈమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని మృతురాలి చెల్లెలు భవాని చెప్పినట్లు తెలిసింది. స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతిరాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని కె.కోటపాడు సీహెచ్‌సీకి తరలిస్తున్నట్లు తెలిపారు. గిరిజన యువతి ఆత్మహత్యతో దేవరాపల్లిలోపాటు కొరపర్తిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


