● కలెక్టర్ దినేష్‌కుమార్ బదిలీ
పాడేరు : అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్ బదిలీ అయ్యారు. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ కారణంగా దినేష్‌కుమార్ ను ఏపీఐఐసీ ఎండీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో 2017బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న టి.నిశాంతిను అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా నియమించారు. ఆమె రెండు, మూడు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలిసింది.


