క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తే కఠిన చర్యలు

Mar 30 2026 8:29 AM | Updated on Mar 30 2026 8:29 AM

కార్యకలపాలపై పటిష్టమైన నిఘా

ప్రత్యేక పోలీసు బృందాల ఏర్పాటు

జిల్లా ఎస్పీ అమిత్‌బర్ధర్‌

పాడేరు : ప్రస్తుతం ఐపీఎల్‌ క్రికెట్‌ సీజన్‌ ప్రారంభమైన దృష్ట్యా క్రికెట్‌ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ బెట్టింగులు జరగకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని బెట్టింగులు నిర్వహించి పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అమిత్‌బర్ధర్‌ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం విలేకరులకు ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్‌ నిర్వాహకులు, ఏజెంట్లు, ఆన్‌లైన్‌ బుకీలపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక పోలీస్‌ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యశతో యువత బెట్టింగ్‌ల జోలికి వెళ్లి నష్టపోవద్దన్నారు. బెట్టింగ్‌ అనేది సరదా, వినోదం కోసం కాదని, అసంఘటిత నేరాలు, ఆర్ధిక మోసాలు, దోపి డీతో సంబంధాలు కలిగి ఉండటమన్నారు. బెట్టింగ్‌ల జోలికి వెళ్లి ఆర్ధికంగా నష్టపోయి అప్పుల పాలై విలువైన జీవితాలను పాడుచేసుకోవద్దని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement