డాబాగార్డెన్స్: నగరంలోని పలు జేసీఐ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఒక హోటల్‌లో ‘ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్’ కార్యక్రమం నిర్వహించా రు. జేసీఐ వాల్తేర్, వైజాగ్ అచీవర్స్, స్మార్ట్, రాయల్స్, పెందుర్తి పర్ల్స్, మధురవాడ మ్యాగ్నెట్స్, వైజాగ్ కింగ్స్ , అరకు న్యూలైట్స్ సంస్థలు కలిసి ఈ శిక్షణను ఏర్పాటు చేశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేసీఐ ఇండియా జోన్–4 అధ్యక్షుడు ఆర్‌పీపీ చైతన్య వసంతవాడ మాట్లాడుతూ.. సభ్యులు తాము నేర్చుకున్న నైపుణ్యాలను నిత్య జీవితంలో ఉపయోగించుకోవాలని సూచించారు. జోన్ వైస్ ప్రెసిడెంట్ ఆర్‌పీపీ బి. దిలీప్ కుమార్ పాల్గొని సభ్యులను ఉత్సాహపరిచారు. ప్రధాన శిక్షకులుగా డాక్టర్ శివ సత్యనారాయణ, సహ శిక్షకులుగా సేన్ సంతోష్ నిమ్మని వ్యవహరించి, వక్తృత్వ కళలో మెళకువలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే విధానాలపై శిక్షణ ఇచ్చారు. జోన్ కో–ఆర్డినేటర్ శ్రవణ్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో యశోద కృష్ణ, బి. శిరీష, మోనిక శ్రీనివాస్, టి. ప్రవీణ్ కుమార్, లంక బేబి, అశోక్ కుమార్ పాల్గొన్నారు.


