రహదారుల పనులు పూర్తి చేయండి | - | Sakshi
Sakshi News home page

రహదారుల పనులు పూర్తి చేయండి

Mar 25 2026 7:23 AM | Updated on Mar 25 2026 7:23 AM

పాడేరు : జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత మారుమూల ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుకు చేపడుతున్న రహదారి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశించారు. బుదవారం తన ఛాంబర్‌ నుంచి ఎస్పీ అమిత్‌బర్దర్‌తో కలిసి గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌, ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్‌ యూనిట్‌ అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాలో అనుమతి పొందిన 30 పనుల వివరాలను ఆయన తెలుసుకున్నారు. పది రోడ్లు పూర్తయ్యాయని మరో పది రోడ్లు రిజర్వ్‌ ఫారెస్ట్‌ అనుమతుల ప్రక్రియలో ఉండగా మరో ఏడు పనులు జరుగుతున్నాయని వివరించారు. మరో మూడు పనులు అనుమతుల కోసం పంపించామన్నారు. జిల్లాలో జరుగుతున్న పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెవెన్యూ, ఫారెస్ట్‌ అనుమతులు, అడ్డకుంలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమీక్ష సమావేశంలో పలు శాఖల ఇంజనీరింగ్‌ శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement